ఎన్నికల హామీల్లో విభిన్నం
తమని గెలిపిస్తే గుబ్బడి లో ఆడ పిల్ల పుడితే రూ.లు 5016
గ్రామానికి సొంత ఖర్చులతో అంబులెన్సు
కత్తెర గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించిన స్వతంత్ర అభ్యర్థి పిట్టల శిరీష శ్రీకాంత్
న్యూస్ తెలుగు ప్రతినిధి సిద్దిపేట/ అక్కన్నపేట : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుబ్బడి సర్పంచి అభ్యర్థి పిట్టల శిరీష శ్రీకాంత్ ఎన్నికల హామీల్లో ప్రత్యేకతను చాటుకున్నారు. ఆడపిల్ల పుట్టిన 21 రోజుల్లో ఆ కుటుంబానికి రూ.5,016 అందిస్తామని, గ్రామానికి సొంత ఖర్చులతో అంబులెన్స్ సదుపాయం కల్పిస్తామని, గ్రామ అభివృద్ధికి నిధులు ఖర్చు చేస్తామని, డ్రైనేజీ, సిమెంటు రోడ్లు నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారు.పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆదరించి కత్తెర గురుక్తు ఓటేసి గెలిపిస్తే గుబ్బడి గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి పిట్టల శిరీష శ్రీకాంత్ అన్నారు. ఆదివారం గుబ్బడి గ్రామంలో మద్దతుదారులతో కలిసి ర్యాలీ చేపట్టి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు, చేతిపంపులు, వీధి దీపాల ఏర్పాటు, వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. యువత భవిష్యత్ కోసం కార్యచరణ రూపొందించి అమలు పరుస్తానన్నారు.(Story : ఎన్నికల హామీల్లో విభిన్నం )

