మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత చారి
న్యూస్తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన కాసోజు.శ్రీకాంత చారి వర్ధంతి సందర్భంగా నిరంజన్ రెడ్డి స్వగృహంలో బి.ఆర్.ఎస్ శ్రేణులతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కె.సి.ఆర్ దీక్షను భగ్నం చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి అనాటి ప్రభుత్వం కుట్రలను నిరసిస్తూ కె.సి.ఆర్ గారికి మద్దతుగా ఆత్మార్పణ చేసుకున్నమొట్ట మొదటి తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంత చారి అని కొనియాడారు. శ్రీకాంత చారి మరణంతో తెలంగాణ ఉద్యమం కె.సి.ఆర్ నాయకత్వములో విద్యార్థి లోకం ఉవేత్తున ఎగిసిపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని అని అన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతవరకు తెలంగాణలో శ్రీకాంత చారి పేరు ఉంటుందని నిరంజన్ రెడ్డి అన్నారు.
నివాళులు అర్పించిన వారిలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మండల పార్టీ అధ్యక్షులు కే.మాణిక్యం,న్యాయవాదులు వెంకట్ రామ్ రెడ్డి, అనంత రెడ్డి,మాజీ కౌన్సిలర్స్ఆవుల. రమేష్ ,నాగన్న యాదవ్,కంచ.రవి,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్, ఇమ్రాన్,జోహెబ్ హుస్సేన్,మంద.రాము,చిట్యాల.రాము,హరీఫ్ పాషా, ఎ. కే.పాషా, అనపటి.రాము, మునికుమార్,ముద్దుసార్,వెంకటేశ్వరమ్మ,అరుణ, భగవంత్ గౌడ్,వెంకటేష్ సాగర్,తదితరులు ఉన్నారు.(Story:మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత చారి)

