Homeవార్తలుతెలంగాణబిఆర్ఎస్ పార్టీ నుండి నలుగురు సర్పంచులు ఏకగ్రీవం

బిఆర్ఎస్ పార్టీ నుండి నలుగురు సర్పంచులు ఏకగ్రీవం

బిఆర్ఎస్ పార్టీ నుండి నలుగురు సర్పంచులు ఏకగ్రీవం

న్యూస్‌తెలుగు/వనపర్తి : మొదటి దశ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మేము బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మా పార్టీకి అండగా నిలిచిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఓటమి గెలుపులతో సంబంధం లేకుండా ప్రజల మధ్య ఉంటూ నిరంతరం ప్రజల సమస్యల పట్ల స్పందించామని ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీయే మాకు అండ అని నమ్మి నలుగురు సర్పంచులను ఏకగ్రీవం చేశారని ఇదే ఉత్సాహముతో పార్టీ శ్రేణులు కష్టపడి పని చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి , గత ప్రభుత్వ పథకాలను ప్రజలకు గుర్తు చేసి ప్రజల అభిమానాన్ని సంపాదించి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలని పిలుపునిచ్చారు. మొదటి దశలో బీఆర్‌ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు: కొడవత్ శాంతి (భర్త: కొడవత్ కృష్ణ నాయక్), గ్రామం కర్నె తండా, మండలం: ఘన్పూర్, రెండోసారి ఏకగ్రీవ విజయం కేతావత్ చంద్రమ్మ (భర్త: ముదావత్ పండు), గ్రామం: కోతులకుంట తండా, మండలం: ఘన్పూర్
ముదావత్ కవిత (భర్త: ముదావత్ శంకర్),
గ్రామం: అముదాలకుంట తండా, మండలం: గోపాలపేట బంగారయ్య
గ్రామం: లక్ష్మీదేవిపల్లి, మండలం: గోపాలపేట గ్రామీణాభివృద్ధికి బీఆర్‌ఎస్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకుని మా అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజల విశ్వాసానికి కట్టుబడి పనిచేస్తాం అని మరొక్కసారి ఏకగ్రీవం చేసిన గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. (Story:బిఆర్ఎస్ పార్టీ నుండి నలుగురు సర్పంచులు ఏకగ్రీవం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!