Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పర్యావరణం, పరిశుభ్రత పరంపర అలవాటుగా మారాలి

పర్యావరణం, పరిశుభ్రత పరంపర అలవాటుగా మారాలి

పర్యావరణం, పరిశుభ్రత పరంపర అలవాటుగా మారాలి

స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జీవి..

న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రతి ఒక్క కుటుంబంలో పర్యావరణ స్పృహ, పరిశుభ్రత అనేవి పరంపర అలవాటుగా మారాలని ప్రభుత్వ చీఫ్‌విప్, స్థానిక శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు మెరుగై న సమాజం, ప్రశాంత వాతావరణం కోసం అవి తప్పనిసరిగా పేర్కొన్నారాయన. వినుకొండ కారంపూడి రోడ్డులోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, మన పరిశుభ్రత-మన ఆరోగ్యం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు విద్యార్థులు, సిబ్బందితో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మాట్లాడుతూ. గతంలోనూ ఎన్నడూ లేని రీతిలో అయిదేళ్ల వైసీపీ పాలనలో చెత్తపై పన్ను వసూలు చేశారని, పైగా 80 లక్షల మెట్రిక్ టన్నుల మేర చెత్తను ఎక్కడిదక్కడే వదిలేసి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రావడంతోనే చెత్త పన్ను రద్దు చేయడంతో పాటు వాళ్లు వదిలేసి పోయిన చెత్తనూ తొలగించామన్నారు. ఆరోగ్యాన్ని సాధించాలంటే పరిశుభ్రత ఉండాలని, అందులో భాగంగా ప్రతి నెలా మూడో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరూ పాటించాలని, భావితరాలకు పరిశుభ్రత వారసత్వంగా అందజేయాలని, అందులో భాగంగానే పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. కాలుష్య నివారణకు తోడ్పడాలని, తద్వారా ఆరోగ్యం కాపాడుకోవడమే కాక భావితరాలకూ కాలుష్య రహిత సమాజ అందించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రతి కార్యాలయం, రోడ్ల మీద ఇలా అన్నిచోట్లా పరిశుభ్రతే కనిపించాలని, స్వచ్ఛమైన, పచ్చనైనా, ఆరోగ్యకరమైన రాష్ట్రం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధించి భావితరాలకు అందించాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తున్నారని అలాంటి వ్యక్తి నాయకుడిగా లభించడం అందరు చేసుకున్న అదృష్టమన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్రంలో వినుకొండను తీర్చిదిద్దాల నే సీఎం చంద్రబాబు, తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story:పర్యావరణం, పరిశుభ్రత పరంపర అలవాటుగా మారాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!