గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్ నందు అంబరాన్ని అంటిన బాలల దినోత్సవం వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక వెన్నపూస కాలనీ నందు ఉన్న గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్ వారు బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గీతాంజలి విద్యాసంస్థల డైరెక్టర్ ఎండ్లూరి శేషగిరిరావు చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్వతంత్ర భారత మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14ను బాలల దినోత్సవం గా జరుపుకోవడం ఆనవైతీ అని తెలిపారు. చిన్నారులు చక్కగా చదువుకొని మంచి నడవడికతో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, కన్న భూమికి పేరు తీసుకొని రావాలని అలాగే మాతృభూమి రుణం తీర్చుకోవాలని కోరారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం అంటే కేవలం ఆటపాటలే కాకుండా మంచి అలవాట్లను అలవర్చుకొని మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ చక్కని లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించగా చూపరులను విశేషంగా అలరించాయి కార్యక్రమంలో కరెస్పాండెంట్ వై ఎల్ కిషోర్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.(Story:గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్ నందు అంబరాన్ని అంటిన బాలల దినోత్సవం వేడుకలు)

