Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వరద బాధితులను పరామర్శించిన సిపిఐ నేతలు

వరద బాధితులను పరామర్శించిన సిపిఐ నేతలు

వరద బాధితులను పరామర్శించిన సిపిఐ నేతలు

న్యూస్ తెలుగు/వినుకొండ  : గత మూడు రోజులుగా కురిసిన మొంథా తుఫాను వల్ల వినుకొండ మండలం విఠంరాజుపల్లి పంచాయతీ వయ్యకంటి శివప్రసాద్ ఎస్.టి కాలనీలో తుఫాను కారణంగా కాలనీలో, ఇళ్లల్లో నడుము లోతు వర్షపు నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వారి సమస్యలను తెలుసుకోవటానికి సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి నాయకులు కాలనీలో వెళ్లి నివాసం ఉంటున్న పేద ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. మొంథా తుఫాన్ వల్ల కాలనీలోకి వర్షపు నీరు నడుము లోతు వచ్చి ఇంట్లో ఉన్నటువంటి వంట సరుకులు, బియ్యం, కందిపప్పు, నూనె తోపాటు, కట్టు బట్టలు, వంట సామాగ్రి, అంతా కూడా వర్షపు నీళ్లలో కొట్టకపోయి ఇళ్లల్లో ఉంటానికి కూడా వీలు లేకుండా వారంతా అప్పటికప్పుడు ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడగలిగామని వంట వండుకోటానికి తెచ్చుకున్నటువంటి సరుకులన్నీ వంట వండుకునే వంట సామాగ్రి కూడా వర్షంలో కొట్టకుపోయి రెండు రోజుల నుంచి తింటానికి తిండి లేక అన్నమో రామచంద్ర అని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే వీరిని నాదుకొని, వీరికి మౌలిక వసతులు, ఆహార సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు కొండ్రముట్ల సుభాని, రాయబారం వందనం, కొప్పరపు మల్లికార్జున, దారివేముల మరియబాబు, బూదాల మనోహర్, వైకంటి శివప్రసాద్ కాలనీ వాసులు సి. హెచ్. నాగరాజు, ఆదయ్య, ఆనందరావు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.(Story  : వరద బాధితులను పరామర్శించిన సిపిఐ నేతలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!