ఎస్జిటి ఉపాధ్యాయుడు మురళి కృష్ణ రాష్ట్ర స్థాయికి ఎంపిక
న్యూస్‌తెలుగు/ వనపర్తి : జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల నందు జిల్లాస్థాయి టిఎల్ఎం మే లను గౌరవనీయులు జిల్లా విద్యాధికారి అబ్దుల్ గాని ప్రారంభించారు .ఇందులో జిల్లాలోని వివిధ మండలాల నుండి మండలానికి పదిమంది చొప్పున మొత్తం 150 మంది ఉపాధ్యాయులు తమ ప్రదర్శనను ఉంచారు. ఇందులో ఉత్తమ ప్రదర్శన అనగా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.ప్రాథమిక పాఠశాల యాపర్ల నందు పనిచేస్తున్నటువంటి ఎస్జిటి ఉపాధ్యాయుడు మురళి కృష్ణ కి జిల్లా స్థాయిలో రెండవ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరు ఈవీఎస్ సబ్జెక్టు నందు ఎంపిక కావడం జరిగింది, వీరి ఎంపికను పలువురు అభినందించారు. (Story:ఎస్జిటి ఉపాధ్యాయుడు మురళి కృష్ణ రాష్ట్ర స్థాయికి ఎంపిక)

