వినకొండ లో కాన్పు.. జిజిహెచ్ లో మృతి..
– 7 రోజుల తర్వాత ఆస్పత్రి ముందు ఆందోళన దిగిన మృతురాలి బంధువులు
– పోలీస్ స్టేషన్ కి చేరిన పంచాయతీ రాజీ చేసిన పోలీసులు
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఏడు రోజుల క్రితం కానుపు అయిన బాలింత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కానుపు సమయంలో వైద్యం వికటించడం వలన మా అమ్మాయి చనిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు,బంధువులు మంగళవారం రాత్రి ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగటంతో పట్టణ పోలీసులు రంగంలోకి దిగి బాధితులను స్టేషన్ వద్దకు తరలించారు. వందల సంఖ్యలో మృతురాలి బాదిత కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరడంతో స్టేషన్ ఆవరణ కిక్కిరిసిపోయింది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్టేషన్ వద్ద పంచాయతీ నడిచింది. ప్రైవేటుపసుపత్రి యాజమాన్యం, వైద్యుల బంధువులు, మృతురాలి కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడి రాజీ చేశారు. అసలు ఏమి జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులను విచారించగా ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన నందిని (20), గుంటూరుకు చెందిన శివ అనే వ్యక్తితో వివాహం జరిగింది. తొలి కానుపుకు పుట్టింటికి వచ్చిన నందిని గత ఏడు రోజుల క్రితం వినుకొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో నందిని గుంటూరుకు తరలించగా ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఆరు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. అయితే నందిని మృతికి వినకొండ లో కాన్పు చేసిన వైద్యుల నిర్లక్ష్యం కారణమని, కానుపు సమయంలో వైద్యం వికటించి మూత్ర విసర్జన బ్లాక్ వద్ద రంద్రం పడి జిజిహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందారని భర్త శివ, మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు వివరించారు. మా అమ్మాయి నందిని మృతికి కారణమైన వినకొండ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టరు, యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగటంతో పోలీసులు అందర్నీ స్టేషన్ కు తరలించి ఎట్టకేలకు రాజీ చేయడం జరిగింది. అయితే నందిని మృతికి కారణం ఏమిటనేది తెలియడం లేదు. జిజిహెచ్ లో వైద్యులు ఇచ్చిన రిపోర్ట్స్ మృతురాలి కుటుంబ సభ్యులు చూపడం లేదు. మృతికి సంబంధించిన కారణాలు తెలపకుండా ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్ తరపు పెద్దలు, పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులలు కూర్చుని రాజీ చేయటం చర్చకు దారి తీసింది. (Story:వినకొండ లో కాన్పు.. జిజిహెచ్ లో మృతి..)


