Homeవార్తలుతెలంగాణ4వ పి.డి.ఎస్.యూ రాష్ట్ర  మహాసభల విజయవంతంకై అహ్వాన సంఘం ఏర్పాటు

4వ పి.డి.ఎస్.యూ రాష్ట్ర  మహాసభల విజయవంతంకై అహ్వాన సంఘం ఏర్పాటు

4వ పి.డి.ఎస్.యూ రాష్ట్ర  మహాసభల విజయవంతంకై అహ్వాన సంఘం ఏర్పాటు

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 28, 29, 30 తేదీలలో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల విజయవంతం కై వనపర్తి జిల్లా కేంద్రంలో ఎం.ఎన్.అర్ ఫంక్షన్ హాల్ లో ఆహ్వాన సంఘ సమావేశం పి.డి.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి అధ్యక్షతన 200 మందితో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, ప్రధాన కార్యదర్శిగా ఏ సాంబ పి.డి.ఎస్.యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు వివిధ సామాజిక రంగాల నుండి మొత్తం 70 మంది సభ్యులతో ఆహ్వాన సంఘం ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం అధ్యక్షులు రాఘవచారి మాట్లాడుతూ వనపర్తి పట్టణంలో ప్రగతిశీల విద్యార్థుల రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం స్ఫూర్తిదాయకమైన విషయమని వనపర్తి జిల్లా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, లౌకిక శక్తులు, మేధావులు, జర్నలిస్టులు, రచయితలు, కవులు, కళాకారులు, వ్యాపార వాణిజ్య వర్గాలు ఆదరించి మూడు రోజులపాటు జరిగే మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా విద్యారంగంలో వస్తున్న మార్పులు మరియు సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారాలు చూపే విధంగా ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్తు విద్యార్థి ఉద్యమ కార్యచరణను ఎంచుకోవాలని తెలిపారు. విద్యను పేద వర్గాల విద్యార్థులకు అందని ద్రాక్షగా మార్చే విధంగా, పాలకవర్గాలు ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడి అనుమతులు ఇస్తు విద్యను వ్యాపారమయం చేస్తున్నాయి అని విటికి వ్యతిరేకంగా పి‌.డి.ఎస్.యూ వంటి విప్లవ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో పి.డి.ఎస్.యూ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కవి జనజ్వల, జాతీయ నాయకుడు ఇ విజయ్ ఖన్న, పాలమూరు అద్యయన వేదిక నాయకులు వెంకటేశ్వర్లు, నారాయణ, పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షుడు కె పవన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్ రంజిత్, సహాయ కార్యదర్శి కె గణేష్, రాష్ట్ర నాయకులు సైదులు, జిల్లా నాయకులు అనిల్, స్వామి, అరుణ్ కుమార్, అన్వేష్, రాధిక, స్వప్న, అనిత తదితరులు పాల్గొన్నారు. (Story:4వ పి.డి.ఎస్.యూ రాష్ట్ర  మహాసభల విజయవంతంకై అహ్వాన సంఘం ఏర్పాటు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!