Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సమాచారం చట్టాలు తీసుకురావడం లో అగ్రగణ్యుడు సురవరం

సమాచారం చట్టాలు తీసుకురావడం లో అగ్రగణ్యుడు సురవరం

సమాచారం చట్టాలు తీసుకురావడం లో అగ్రగణ్యుడు సురవరం

సుధాకర్ రెడ్డి కి నివాళలు అర్పించిన అఖిలపక్షం, ప్రజాసంఘాలు

న్యూస్ తెలుగు/ చింతూరు : సిపిఐ జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విధానపరమైన పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసేవారిని ఆయన అజాత శత్రువు అని గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం యుపిఎ 1 లో తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకం అని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు

సోమవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో జిల్లా సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభ సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది.
అంతముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మృతికి సంతాపం ప్రకటించారు

ముందుగా ప్రముఖ వ్యాపార వేత్త కంటిపూడి సర్వరాయుడు మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి అజాతశత్రువుగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. కర్నూలు నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఢిల్లీ స్థాయికి ఎదిగారని తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ఆయన ఏనాడూ ఆలోచించలేదన్నారు. ఆ బాధ్యతలను ఆయన సతీమణి విజయలక్ష్మి నిర్వహించేవారని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణ జరగాలని ఆయన ఆకాంక్షించారని అన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి టీ అరుణ్ మాట్లాడుతూ కామ్రేడ్ సురవరం నిరంతరం పీడిత వర్గాల ప్రజలను ఐక్యం చేయడానికి కృషి చేశారని ఎప్పడు నవ్వుతూ ఉండేవారని సోషలిజం కోసం పరితపించారని ఆయన ఆకాంక్ష నెరవేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి మృతి పట్ల దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు బాధ వ్యక్తం చేశారని తెలిపారు.
దేశంలో మతోన్మాద రాజకీయాలు విజృంభిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో సుధాకర్ రెడ్డి మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా నాయకుడిగా వివిధ రాష్ట్రాలు తిరుగుతూ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించారాని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం తిరుపతిలో ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. అప్పట్లో ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకుడిగా సుధాకర్ రెడ్డి క్రియాశీల పాత్ర పోషించారన్నారు.

ఆమాద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోకల వరద రాజు సాది మాట్లాడుతూ
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పూర్వపు జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు, గ్రామీణ కష్టజీవుల ఆశాజ్యోతి, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమ నేత కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఇటీవల అకస్మికంగా, అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయన జీవితకాలం అహర్నిశలు గ్రామీణ కష్టజీవులు,పేదలు జీవన పరిస్థితులు మెరుగుపడాలని ఆకాంక్షించిన వ్యక్తి అని ఆయన అన్నారు

టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో పనిచేశారు. అనంతరం పార్టీలో అత్యంత కీలకమైన పదవులలో ఉన్నప్పటికీ ఆయన అణగారిన వర్గాలను మరువలేదని అన్నారు

అఖిలపక్ష నాయకులు దాసిరెడ్డి బలరాం నాయుడు మాట్లాడుతూ 2004 సంవత్సరంలో ఎంపీ అయిన తర్వాత భారత పార్లమెంటులో యూపీఏ వన్ ప్రభుత్వంలో పార్లమెంటరీ కమిటీలో అసంఘటిత రంగ కార్మికుల జీవన పరిస్థితులు, వారి వేతనాలపై నియమించిన కమిటీకి చైర్మన్ గా వ్యవహరించి కార్మికులకు విద్య,వైద్యం, ఆరోగ్యం దినసరి వేతనాలు, పౌష్టికాహారం సక్రమంగా అందించాలని ఒక నివేదిక ఇచ్చారని ఆయన అన్నారు

జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షుడు కె రాంబాబు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రూపకల్పనకు ప్రధాన కృషి చేశారు. అటవీ హక్కుల సంరక్షణ చట్టం, సమాచార హక్కు చట్టం తో పాటు పేదలకు ఉపయోగపడే అనేక చట్టాలను తీసుకురావడంలో అగ్రగన్యుడు అయ్యాడు. సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం పార్టీకి వ్యవసాయ కార్మిక సంఘానికి తీరని లోటు. అని ఆయన అన్నారు

ప్రజానాట్య మండలి సీనియర్ నేత బొడ్డు బుల్లబ్బాయి రాష్ట్ర ఉపధ్యక్షులు మహంతి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ సీపీఐ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ప్రజా కళలను ప్రోత్సహించడం జరిగిందని వామపక్షాల పునరేకీకరణ జరగాలని బలంగా ఆకాంక్షించారని వారు తెలిపారు

ఇంకా ఈ సభలో టిడిపి మాజీ సిటీ అధ్యక్షులు రెడ్డి మణి సిఐటియు జిల్లా కార్యదర్శి బి పవన్, పూర్ణిమ రాజు సీపీఐ నగర కార్యదర్శి వి కొండలరావు సహాయ కార్యదర్శి సప్పా రమణ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి.లావణ్య ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.త్రిమూర్తులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. జ్యోతిరాజు తోట.లక్ష్మణ్ ప్రజానాట్యమండలి నగర కార్యదర్శి ఎస్ నౌరోజీ మున్సిపల్ వర్కర్ యూనియన్ అధ్యక్షులు రెడ్డి రమణ కార్యదర్శి అల్లం వెంకటేశ్వరావు దుర్గమ్మ కాకి శారద జట్లు సంఘం అధికార బాడి నల్ల రామారావు పి దేవుడు బాబు బాలకృష్ణ రెడ్డి వెంకట్రావు మహిళా సమైక్య సీనియర్ నాయకులు ఎడ్ల లక్ష్మి సేపిని రమణమ్మ ఉమా, పిల్ల కొండమ్మ వానపల్లి సూర్యనారాయణ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. సిపిఐ పార్టీ, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story :సమాచారం చట్టాలు తీసుకురావడం లో అగ్రగణ్యుడు సురవరం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!