Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రజా సేవలో అపారమైన కృషి చేసిన నాయకుడు చంద్రబాబు

ప్రజా సేవలో అపారమైన కృషి చేసిన నాయకుడు చంద్రబాబు

ప్రజా సేవలో అపారమైన కృషి చేసిన నాయకుడు చంద్రబాబు

న్యూస్ తెలుగు/సాలూరు : ప్రజా సేవలో అపారమైన కృషి చేసిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సోమవారం 21వ వార్డులో తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కేక్ కట్ చేసిహృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, నేటి వరకు నాలుగుసార్లు సీఎం పదవిలో కొనసాగుతూ 14 ఏళ్లు 11 నెలలు (5,442 రోజులు) ప్రజాసేవలో అపారమైన కృషి చేసిన నాయకుడిగా నిలిచారని తెలిపారు.హైదరాబాద్ రూపురేఖలు మార్చిన హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు ఆయన దూరదృష్టికి నిదర్శనమని గుర్తుచేశారు. నాడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, నేడు అమరావతిలో క్వాంటం వ్యాలీ రూపకల్పన చేసిన నాయకుడు చంద్రబాబు గారేనని అన్నారు. అలాగే 2024లో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ అమరావతి, పోలవరం, విశాఖ, రాయలసీమ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు.
మీ పరిపాలన దక్షత, క్రమశిక్షణ, నిబద్ధత, కృషి, అంకితభావం, పట్టుదల అన్ని తరాలకు ఆదర్శం. మీ నాయకత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేయడం నాకు గర్వకారణం. మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మ తిరుపతిరావు. వార్డ్ కౌన్సిలర్ బందాపు సీతమ్మ, టిడిపి నాయకులు అల్లు అప్పయ్యమ్మ, వాడాడ శోభా రాణి, కునిశెట్టి భీమారావు, బందాపు సతీష్, బృందావనం అశోక్ తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రజా సేవలో అపారమైన కృషి చేసిన నాయకుడు చంద్రబాబు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!