Homeవార్తలుతెలంగాణదేశం,రాష్ట్రం కోసం పోరాడిన ఘన చరిత్ర ఏఐఎస్ఎఫ్ సొంతం: రమేశ్

దేశం,రాష్ట్రం కోసం పోరాడిన ఘన చరిత్ర ఏఐఎస్ఎఫ్ సొంతం: రమేశ్

దేశం,రాష్ట్రం కోసం పోరాడిన ఘన చరిత్ర ఏఐఎస్ఎఫ్ సొంతం: రమేశ్

న్యూస్‌తెలుగు/వనపర్తి : దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఘన చరిత్ర ఏఐఎస్ఎఫ్ సొంతమని ఏఐఎస్ఎఫ్ వనపర్తి జిల్లా ఇంచార్జ్ నరేష్ అన్నారు. వనపర్తి అంబేద్కర్ చౌక్ లో ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినం ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ అరుణ పతాకాన్ని రమేష్ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఇంచార్జ్ రమేష్, మాజీ విద్యార్థినేత గోపాలకృష్ణ మాట్లాడారు. 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ లక్నో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించింది అన్నారు. నేటికీ 90 వసంతాలు గడిచిందన్నారు. విద్యార్థుల హక్కుల కోసం దేశ స్వాతంత్రం కోసం ఏఐఎస్ఎఫ్ ఆనాడు పోరాడిందన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర, 90 వసంతాల సుదీర్ఘ ప్రయాణం దేశంలో మరే విద్యార్థి సంఘానికి లేదన్నారు. ఏఐఎస్ఎఫ్ మొదటి మహాసభకు స్వాతంత్ర సమరయోధుడు మహమ్మదల్లి జిన్న అధ్యక్షతన జరిగిందన్నారు. ఐకే గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్పేయ్ వంటి ప్రధాన మంత్రులు ఏఐఎస్ఎఫ్ లో రాజకీయ ఓనమాలు దిద్దిన వారేనని, దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మంత్రులు అయ్యారన్నారు. దేశానికి అందించ స్వాతంత్రానంతరం ప్రభుత్వ విద్య పరిరక్షణ, విద్యార్థుల సంక్షేమం, విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, విద్యార్థుల దోపిడీకి వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు కొనసాగిస్తూ వస్తుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏఐఎస్ఎఫ్ ఉద్యమించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిందన్నారు.కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విద్యార్థులకు ఇవ్వవలసిన రూ. 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లను పెంచాలన్నారు. ఫీజులను నియంత్రించాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేష్, తాలూకా కార్యదర్శి వంశీ,మాజీ విద్యార్థి నేతలు లక్ష్మీనారాయణ, మహేష్, చందు, విష్ణు, శివ యాదవ్, చరణ్, నరేష్, బన్నీ, సాయి చరణ్, అశోక్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. (Story:దేశం,రాష్ట్రం కోసం పోరాడిన ఘన చరిత్ర ఏఐఎస్ఎఫ్ సొంతం: రమేశ్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!