Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ ఆగస్టు 13న రైతు సంఘాల నిరసన..దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం

 ఆగస్టు 13న రైతు సంఘాల నిరసన..దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం

ఆగస్టు 13న రైతు సంఘాల నిరసన..

దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం

న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక సిపిఐ కార్యాలయం, శివయ్య భవనంలో సోమవారం రైతు సంఘం కార్యాలయంలో రైతు సంఘం నాయకులు బాలస్వామి అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ. ఈనెల 13వ తేదీన సంయుక్త రైతు సంఘాల సమన్వయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో ట్రంప్, మోడీ ల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ట్రంప్, మోడీల దిష్టిబొమ్మలు దగ్నం చేయాలని పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లాలో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, వెంటనే ట్రంప్ మన దేశం పైన విధించిన 50% సుంకాలను వెనక్కి తీసుకోవాలని, మోడీ వెంటనే డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చాలని, వ్యవసాయ వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దుచేయాలని రాము డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి పిన్నబోయిన వెంకటేశ్వర్లు, బాలస్వామి, వెంకటరత్నం, రామయ్య, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.(Story: ఆగస్టు 13న రైతు సంఘాల నిరసన..దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!