Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బ్యాడ్మింటన్ కు కమల్ కుమార్ ఎంపిక

బ్యాడ్మింటన్ కు కమల్ కుమార్ ఎంపిక

బ్యాడ్మింటన్ కు కమల్ కుమార్ ఎంపిక

న్యూస్ తెలుగు/ వినుకొండ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ కోచింగ్ సెంటర్,యానాం లో నిర్వహించిన సెలక్షన్స్ లో వినుకొండ గుడ్ షెఫర్డ్ స్కూల్లో 8వ తరగతి చదువుతూ, గోపు బాలిరెడ్డి ఇండోర్ స్టేడియం లో బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి కోట కమల్ కుమార్ అండర్ 14 కేటగిరీలో ఎంపిక అయ్యాడు. ఈ సందర్బంగా సెలెక్ట్ అయిన విద్యార్థి కి, విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గోపు ఇన్నారెడ్డి జీబీర్ స్టేడియంలో సన్మానించి అభినందించారు. కమల్ కోచింగ్ నిమితం నేడు యానాం వెళ్తున్నాడని, ఇక అక్కడే ఐదు సంవత్సరాలు ఉచితంగా విద్యతోపాటు, బ్యాడ్మింటన్ ఉచిత కోచింగ్ ఇస్తూ నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడేందుకు శిక్షణ ఇస్తారని డైరెక్టర్ డాక్టర్ గోపు ఇన్నారెడ్డి వెల్లడించారు. స్టేడియం నిర్మాణ దశ నుండి తమ వద్ద కోచింగ్ తీసుకుంటూ జాతీయ స్థాయికి విద్యార్థి ఎంపికవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరింత మందిని ఇదే స్థాయిలో తీర్చిదిద్దనున్నమన్నారు. (Story:బ్యాడ్మింటన్ కు కమల్ కుమార్ ఎంపిక)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments