ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తిరుమలయ్య గుట్టను ఏర్పాటు చేద్దాం
న్యూస్‌తెలుగు/వనపర్తి : శ్రావణమాస రెండవ శనివారం వనపర్తి ఇలవేలుపూ తిరుమలయ్య గుట్టపై తిరుమలనాథ స్వామి దర్శనార్థం వెళ్లిన ఐక్యవేదిక సభ్యులకు నిస్వార్ధ ఆర్గనైజేషన్ వారు బట్ట ప్లాస్టిక్ రహిత సమాజాన్ని పరిచయం చేయాలని కోరడంతో మేము కూడా ప్రజలకు ప్లాస్టిక్ వద్దని, బట్ట బ్యాగు లేని ముద్దని ప్రచారం చేయడం జరిగింది. ఆ తరువాత తిరుమల స్వామిని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ దర్శించుకున్నారు. మాట్లాడుతూ,వనపర్తి ప్రజలకు ఆయురారోగ్యాలు, దీవెనలు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది అవినీతిపరులను అంతమొందించాలని మొక్కుకోవడం జరిగింది. రాబోయే ఎన్నికలలో అవినీతిపరులను ఓడించాలన్న మా లక్ష్యానికి బలం చేకూర్చలని స్వామిని వేడుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తోపాటు యూత్ కాంగ్రెస్ నాయకులు పాండు సాగర్, గౌని కాడి యాదయ్య, నాగరాజు, రామస్వామి, శ్రీను, నిస్వార్థ ఫౌండేషన్ యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. (Story:ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తిరుమలయ్య గుట్టను ఏర్పాటు చేద్దాం)

