Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండలో పొలం పిలుస్తుంది

వినుకొండలో పొలం పిలుస్తుంది

వినుకొండలో పొలం పిలుస్తుంది

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గం లోని నరగాయపాలెం , వెంకుపాలెం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి జి. వరలక్ష్మి మాట్లాడుతూ. రైతులు పంటల భీమా పథకంలో కంది మరియు ఎర్ర మిరప పంటలకు జూలై 31 వరకు గడువు తేదీగా నిర్ణయించారు. వరి పంటకు ఆగస్టు 15 వరకు గడువు కాలం ఉందని ,వరి పంటకు ఎకరాకు 80 రూపాయలు ప్రీమియం, కంది పంటకు ప్రీమియం ఎకరాకు 40, మిరప పంటకు ఎకరాకు 360 రూపాయలు ప్రీమియం ను దగ్గర్లోని సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ లో పట్టాదారు పాస్ బుక్కు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ వన్ బి లతో నమోదు చేసుకోవాలని, కంది పంటకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎకరాకు 20000 వరి పంటకు ఎకరాకు 40000 మిరపకు 90000 కవరేజ్ ఉంటుందని రైతు సోదరులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతులు లావు వరి రకాలను ఎం.టి.యు 1161 సాగు చేయకూడదని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయబడదని ప్రత్యామ్నాయంగా జేజిఎల్ 384 బిపిటి 5204 కే.ఎన్.ఎం 1638 లాంటి రకాలను సాగు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరకాయపాలెం విస్తరణాధికారి భార్గవి,గ్రామపశు సంవర్ధక శాఖ అధికారి రైతు సోదరులు పాల్గొన్నారు. (Story:వినుకొండలో పొలం పిలుస్తుంది)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!