Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

న్యూస్ తెలుగు /వినుకొండ : దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలోని చెక్ పోస్ట్ సెంటర్ నందు వై.యస్.ఆర్ విగ్రహానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన పులిహోర పంపిణీ కార్యక్రమం ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్ , వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ యోగి వేమా రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు..

శ్రీ యోగి వేమా రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం వినుకొండ సంఘం ఆఫీసు పరిధి లో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. రెడ్డి సోదర సోదరీమణులు పాల్గొని పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. పెద్దలు అనేక మంది వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనను కొనియాడారు. ఈ సందర్బంగా పెద్దలు సంఘం ప్రెసిడెంటు అరే శివారెడ్డి మాట్లాడుతూ. వైస్సార్ ప్రతి ఒక్క ప్రజల గుండెలలో కొలువై ఉన్నారని, పేదప్రజల మరచి పోనీ మహనీయుడు అని అన్నారు. పెద్దలు అమ్మిరెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ. సమాజం లో ఇలాంటి మహనీయులు ఒక్కరే పుడతారు అని, ప్రజలకోసం పుట్టి ప్రజలకోసమే చనిపోయిన వ్యక్తి అని అన్నారు. అలాగే వినుకొండ ఎంపీపీ పగడాల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు ప్రపంచం లో ఎవరైనా ఉన్నారు అంటే అది వైస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు. అనంతరం ప్రజలకు పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ పెద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, ట్రెజరర్ యర్రం రామిరెడ్డి , మూలే వెంకటేశ్వర రెడ్డి, ములకా రామతులసి రెడ్డి, కేసరి ప్రకాష్ రెడ్డి, కొత్త కృష్ణారెడ్డి , మూలే బాల చెన్న రెడ్డి ,తుమ్మా రామకృష్ణా రెడ్డి, పీవీ రమణా రెడ్డి ,సోము వెంకటేశ్వర రెడ్డి, దశరథ రామిరెడ్డి,జయ క్రిష్ణారెడ్డి , బిజ్జo వెంకటేశ్వర రెడ్డి, బిక్కం వెంకట నారాయణ రెడ్డి, సెనిగే నారాయణ రెడ్డి,జనపాల వెంకటేశ్వర రెడ్డి,లేళ్ల అంజిరెడ్డి , యజ్ఞం రామిరెడ్డి , మనుగుంట రమణా రెడ్డి , సుందర్ రెడ్డి,అనుముల నాసర్ రెడ్డి, రోడ్డా శ్రీనివాసరెడ్డి,మలపాటి కోటిరెడ్డి,మూలే పప్పీ రెడ్డి ,మేడమ్ జయరామిరెడ్డి ,మేడమ్ నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

 

(Story:వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!