వృద్ధులకు బియ్యం, పండ్లు పంపిణీ..
న్యూస్ తెలుగు / వినుకొండ : పట్టణంలోని గుమ్మడి వృద్ధాశ్రమానికి “ఈటీవీ పాడుతా తీయగా” ఆర్కెస్ట్రా బృందం లోని సభ్యులైన ప్యాడ్ ప్లేయర్ సిహెచ్ విజయ రాజు, ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ లావణ్య ఆశ్రమాన్ని సందర్శించారు. మానవసేవే మాధవ సేవగా భావించి వృద్ధులకు సేవలందిస్తున్న గుమ్మడి దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు బియ్యం పండ్లు అందించారు. అనంతరం పంచాయతీ సెక్రటరీగా సేవలందించి పదవి విరమణ చేసిన టి. సూరి ని ఘనంగా సత్కరించి వారు వృత్తిలో అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భీమవరపు ఏడుకొండలు, రావిపాటి వీరయ్య, పారెళ్ల ప్రసాద్, దాసరి నాగేశ్వరరావు, దొండపాడు బ్రహ్మయ్య, గిరిబాబు, గుమ్మడి తదితరులు పాల్గొన్నారు.(Story:వృద్ధులకు బియ్యం, పండ్లు పంపిణీ..)

