విత్తన షాపులను ఆకస్మిక తనిఖీలు చేసిన వ్యవసాయాధికారులు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ టౌన్ పరిధిలోని విత్తనాలు షాపులను వినుకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు బోయపాటి రవిబాబు మరియు మండల వ్యవసాయ అధికారి జీ వరలక్ష్మి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాప్ లోని స్టాక్ నిల్వలను, స్టాక్ రిజిస్టర్ ఇన్వాయిస్ , బిల్ పుస్తకాలు పరిశీలించారు. ఎవరైనా అనధికార గ్లైసిల్ బీటీ ప్రతి విత్తనాలు విక్రయించినట్లయితే విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలను ఎమ్మార్పీ మించి విక్రయించకూడదని, రైతులకు లాట్ నెంబర్ రాసి బిల్లు ఇవ్వాలని, రైతులు పంట సీజన్ పూర్తి అయ్యేవరకు బిల్లును, ఖాళీ సంచిని భద్రపరుచుకోవాలని అన్నారు. గ్రామాలలో రాత్రి వేళల్లో వాహనాల్లో లూజు ప్రతి విత్తనాలు అనధికారికంగా విక్రయాలు జరుపుతున్నాట్లఐతే సమాచారం సంబంధిత వ్యవసాయ అధికారి కి తెలపాలన్నారు. రైతులు ఇలాంటి అనధికార లూజు విత్తనాలను కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. రైతులు అధీకృత డీలర్ల నుండి మాత్రమే బిల్లుతో విత్తనాలు కొనుగోలు చేయాలని అన్నారు. (Story:విత్తన షాపులను ఆకస్మిక తనిఖీలు చేసిన వ్యవసాయాధికారులు)

