Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మహిళలపై అనిచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను శిక్షించాలి

మహిళలపై అనిచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను శిక్షించాలి

మహిళలపై అనిచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను శిక్షించాలి

మహిళా సంఘాల డిమాండ్

న్యూస్ తెలుగు / వినుకొండ : రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివిఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్ రావు, ప్రసారం చేసిన సాక్షి టీవీ యాజమాన్యం వైయస్ భారతి పై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా మహిళలపై వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం వినుకొండ పట్నంలో మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్, మహిళా సంఘం నాయకులు షేక్. షకీలా మాట్లాడుతూ. రాష్ట్రంలో అరాచక పాలనను పారద్రోలి వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసిన బుద్ధి రాలేదన్నారు. రాష్ట్రంలోని మహిళలను కించపరిచే విధంగా భారతి రెడ్డి తన ఛానల్ లో చేయించిన అసభ్యకర వ్యాఖ్యలను సభ్య సమాజం ఖండిస్తున్నాను. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న సాక్షి పత్రిక ఛానల్ ను ప్రజలు బహిష్కరించాలని, అనుమతులను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే వైశ్య అనే పదాన్ని శాశ్వతంగా తొలగించి, మహిళను వ్యక్తిగతంగా దూషణకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలని కించపరిచే విధంగా ప్రసారం చేసిన సాక్షి మీడియా యాజమాన్యం వైయస్ భారతి, జగన్ రెడ్డిలు బెషరతుగా మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినుకొండ తాసిల్దార్ సురేష్ నాయక్ కు మహిళలు వినతి పత్రం అందజేశారు. (Story:మహిళలపై అనిచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను శిక్షించాలి)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!