రీ వ్యాల్యూషన్లో విద్యార్థులకు ఊరట
న్యూస్ తెలుగు /వినుకొండ : ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాలతో పాటు ఇంటర్మీడియట్ బెటర్మెంట్ ఫలితాలలో విశ్వ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారని కళాశాల డైరెక్టర్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస శర్మతో పాటు ఆ కళాశాల ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనీలు తెలిపారు. వినుకొండ కొత్తపేటలోని లాయర్స్ స్ట్రీట్ విశ్వసాయి జూనియర్ కళాశాలలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అభినందన సభలో ఎంసెట్లో విజేతలుగా నిలిచిన ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ మరియు మెడికల్ నందు అత్యుత్తమంగా 25 వేల లోపు ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు 13 మంది ఉన్నారని చెప్పడానికి మేము సంతోషిస్తున్నామన్నారు. డి సాత్విక – 1281, దోసపాటి వైష్ణవి 4828, షేక్ ఆఫ్రిన్ 6384, షేక్ సబీహ 6757, ఏ శ్రీలక్ష్మి 11046, ఏ గురు లక్ష్మి 12886, పి శ్రీవాణి 17357, వి సీతారాం 17884, పి మౌనిక 17962, షేక్ మహబూబ్ సుబానీ 18900, జి కీర్తన 21615, షేక్ సాదియా 22115, జి అమృత 24079. మొత్తం 13 మంది స్టేట్ ర్యాంకులు సాధించారని, అలాగే జూనియర్ కళాశాల బెటర్మెంట్ ఫలితాలలోను ఎంపీసీ విభాగంలో టౌన్ ఫస్ట్ 470 కి 465 మార్కులు ముగ్గురు విద్యార్థులు 2025 ఇంటర్ బెటర్మెంట్ పరీక్షా ఫలితాలలో విజయభేరి మోగించి అతి తక్కువ మంది విద్యార్థులతో అత్యుత్తమ మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించిన ఏకైక విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కళాశాల అని అన్నారు. 2025 ఇంటర్మీడియట్ బెటర్మెంట్ పరీక్షా ఫలితాలల్లో వినుకొండ పట్టణంలో విశ్వసాయి విద్యార్థుల విజయఢంకా. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి, సీఈసీ విభాగాలలో అత్యుత్తమ మార్కులు సాధించామని సంతోషిస్తున్నాం. ఇంటర్మీడియట్ స్థాయిలో పాస్ పర్సంటేజ్ లో రాష్ట్రంలోనే అత్యుత్తమ స్థానాన్ని కైవసం చేసుకున్న విశ్వసాయి జూనియర్ కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఆర్ అక్షిత 465/470, ఎస్కే ఫాతిమా 465/470, ఖాదర్ అక్షయ 465/470, డి ఉషశ్రీ 464/470, పాల్వాది సత్యమన్విత 464/470, అరవపల్లి వెంకట దివ్య 464/470, ఎస్.కె.మాహి షాఫియా 462/470, ఎం హైమావతి 462/470. బైపీసీ విభాగంలో 440కి 434 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలబెట్టారన్నారు. వరుస విజయాలు అందిస్తున్న విద్యార్థులకు అందుకు కృషి చేస్తున్న అధ్యాపక బృందానికి తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి కార్పెట్ విద్యాసంస్థలకు ధీటుగా వినుకొండ నుంచి తామెప్పుడు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story:రీ వ్యాల్యూషన్లో విద్యార్థులకు ఊరట)

