ఘనంగా డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : మాటలు చెప్పే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” అన్న స్ఫూర్తితో శుక్రవారం అభిమాన నిర్మాత, స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ డాక్టర్ “దగ్గుబాటి రామానాయుడు” ‘జయంతి ‘సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వినుకొండ “విక్టరీ వెంకటేష్ &రానా బాబు” ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హాండ్స్ సభ్యుడు శివకుమార్ ఆధ్వర్యంలో వినుకొండ వెంకటేష్ అభిమానులచే గుంటూరులో”మానవతా సేవా సమితి” వృద్ధాశ్రమం వృద్ధులకు, అనాధలకు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం “విక్టరీ వెంకటేష్” వీరాభిమాని నరసరావుపేటకు చెందిన, సయ్యద్ మస్తాన్ వలి అనారోగ్యంతో ఉన్న కారణంగా ‘ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్’ టీం ద్వారా సేకరించిన 45 వేల రూపాయలు “విక్టరీ వెంకటేష్” సీనియర్ అభిమానులైన కోరుకొండ శ్రీనివాస్ (ఏలూరు) జి.శివయ్య (స్వర్ణ.కారంచేడు) రఘు (ఒంగోలు) చేతుల మీదగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జే. ఎస్. కే. దాదాసాహెబ్, పి శంకర్, ఎం సుధీర్, శ్రీరామ్ వెంకటకృష్ణ, జి. వెంకీ రెడ్డి ,సయ్యద్ మస్తాన్ వలి, ఎస్.కె అబ్దుల్ రహీం, పి కరిముల్లా ఖాన్, పి. బాజీఖాన్, పి. కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.(Story : ఘనంగా డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు జయంతి వేడుకలు )

