Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శాంతి చర్చల కోసం ఉద్యమిద్దాం

శాంతి చర్చల కోసం ఉద్యమిద్దాం

శాంతి చర్చల కోసం ఉద్యమిద్దాం

శాంతి చర్చిల ప్రతినిధి సుధాకర్ ఎన్కౌంటర్ ను ఖండిద్దాం

సుధాకర్ మృతదేహాన్ని భద్రపరిచి కుటుంబ సభ్యులకి ఇవ్వాలని నినదిద్దాం

న్యూస్ తెలుగు/వినుకొండ  : ఆయుర్వేద వైద్యుడు, మావోయిస్టు పార్టీ నాయకుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన చర్చల్లో మావోయిస్టు పార్టీ ప్రతినిధి చలం ఏలియాస్ సుధాకర్, సోమన్న ను గురువారం ఉదయం చతిస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో ఎన్కౌంటర్లో కాల్చి వేసినట్లు ప్రకటించారు.ఇటీవల వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లో 60 ఏళ్ల నుండి 70 ఏళ్ల పై పడ్డవాళ్లను టార్గెట్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చంపేస్తూ ఉన్నాయి. వారి జీవితం మొత్తం ప్రజల కోసం అంకితం చేసి, తీవ్ర అనారోగ్యాలతోటి కదల లేని స్థితిలో ఉన్న వయోభారంతో ఉన్న చర్చల సుధాకర్ లాంటి వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పెట్టకుండా చంపి తమ ఘనతగా ప్రకటించుకోవటం ఈ ప్రభుత్వ ఫాసిస్టు చర్యలకు నిదర్శనం. భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే కనీజ సంపదను కార్పొరేట్ దోపిడీ దొంగలకు దోచిపెట్టడానికి, దేశాన్ని లూటీ చేయడానికి పాలకవర్గాల బరితెగింపే ఎన్కౌంటర్ల హత్య కాండ, ప్రతిపక్షాలు అడ్డుకో లేనిది, ఆదివాసులు, విప్లవకారులు అడ్డుకోవడంతో వారిపై దేశ సరిహద్దును కాపాడే, దేశ ప్రజలను కాపాడాల్సిన సైనిక బలగాల ద్వారా, ఆధునిక యంత్రాల ద్వారా, కోట్ల రూపాయలు అవార్డులు రివార్డులు పేరుతో వేదజల్లుతూ రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు, హిట్లర్, ముసోలిన్ లకు తీసిపోని విధంగా పాసిజాన్ని దేశంలో అమలు చేస్తున్నారు, తాత్కాలిక విజయాలకు మురిసిపోకండి. మీ దోపిడీ దౌర్జన్యాలు ప్రజలు చైతన్యంగా అర్థం చేసుకున్న నాడు మీ దోపిడి కోటలు బ్రదలవుతాయి, ప్రజలు ప్రజా ఉద్యమాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి. మద్య భారతంలో జరిగే మారణకాండ, ప్రజలు ప్రజాస్వామిక వాదులు, రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు ఖండించడమే కాకుండా ప్రజా ఉద్యమ నిర్మాణానికి మీ వంతు మీరు కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నాము.ఈ వెలుగులో శాశ్వత శాంతి చర్చల కోసం ఉద్యమిద్దాం, బూటకపు ఏన్ కౌంటర్ల మారనకాండను నివారిద్దాం. శాంతి చర్చల ప్రతినిధి సుధాకర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి ఇవ్వాలి, అంతవరకు మృతదేహాన్ని భద్రపరచాలి అని పిడిఎం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వినుకొండ తాహసిల్దార్ ఆఫీస్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో పిడిఎమ్ జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్వలి, జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ, పిడిఎం నాయకులు వై. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.(Story : శాంతి చర్చల కోసం ఉద్యమిద్దాం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!