Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండ పురపాలక సంఘం

వినుకొండ పురపాలక సంఘం

వినుకొండ పురపాలక సంఘం

న్యూస్ తెలుగు/వినుకొండ  : రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీ వి ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సూచనలతో జూన్ 7వ తారీఖున జరుపుకోబోయే బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ కుంట నందు గల ఈద్గా వద్ద పురపాలక సంఘం తరపున 4 లక్షలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ పనులను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు. ఈ సందర్బంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. ముస్లింల ముఖ్య పండుగల్లో ఈద్-ఉల్- అధా ఒకటని దీన్ని త్యాగానికి ప్రతీక గా జరుపుకుంటారని అన్నారు. అలాగే పండుగ రోజున ఈద్గా కు వచ్చే ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు- మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి షైదా, టిడిపి పట్టణ అధ్యక్షుడు అయుబ్ ఖాన్, సుబేదార్ అజీజ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.(Story : వినుకొండ పురపాలక సంఘం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments