అరాచక పాలన నుండి విముక్తి లభించి ఏడాది..
న్యూస్ తెలుగు / వినుకొండ : కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యకుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు, వినుకొండ జనసేన పార్టీ నాయకులు కొణిజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి టీడీపీ, బీజేపీ పార్టీకు చెందిన నాయకులతో కలిసి శివయ్య స్తూపం సెంటర్లో పీడ విరగడై ఏడాది పేరుతో పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో నాగశ్రీనురాయల్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి షమీమ్, ఆయూబ్ ఖాన్, మేడం రమేష్, పివి సురేష్, కౌన్సిలర్లు షకీలా బేగం పాటు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:అరాచక పాలన నుండి విముక్తి లభించి ఏడాది..)

