మావోయిస్టు మృతదేహాలను కుటుంబ సభ్యులకి ఇవ్వకుండా దహనం చేయటం చట్ట వ్యతిరేకం
న్యూస్ తెలుగు /వినుకొండ : ఈ నెల 21న చత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మరణించారు. ఆంధ్ర తెలంగాణకు చెందనంబల కేశవరావు, సజ్ఙా నాగేశ్వరరావు, రాకేష్, విజయలక్ష్మి, సంగీత మరికొందరు చతిస్గడ్ మృతుల శవాలను గత రాత్రి నారాయణపూర్ దగ్గర దహనం చేసినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. ఈనెల 22వ తేదీ నుండి తమ కుటుంబ సభ్యుల బాడీలు ఇవ్వాలని ఈ ఐదు కుటుంబాలకు చెందిన వాళ్లు నారాయణపూర్ వెళ్లి అధికారులకి అన్ని రకాల ప్రూఫ్లు ఇవ్వడం జరిగింది, బాడీలు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని కాలయాపన ఒక వైపు చేస్తుంటే, మరో వైపు నంబాల కేశవరావు, సజ్జా నాగేశ్వరావుల బంధువులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టు విచారించే సందర్భంలో చతిస్గడ్ అట్టర్ని జనరల్ ని సంప్రదించగా గడిచిన శనివారం సాయంత్రం లోపు అన్ని బాడీలకి పోస్టుమార్టం పూర్తవుతుంది, వారి బంధువులకు బాడీలను అప్పచెబుతామని తెలియజేశారు. హైకోర్టు న్యాయమూర్తి కి ఈ విధంగా తెలియజేసి, దీనికి భిన్నంగా చట్ట విరుద్ధంగా బాడీలను తగలబెట్టామని ప్రకటించడం, చట్టం పట్ల, వీరికి ఉన్న నిబద్దత ఏ పాటిది! దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చే ఈ మొత్తం సంఘటన పై విచారణ జరిపించి, బాధిత కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని, దానికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగాన్ని ఎవరైనా ఉల్లంగిస్తే చట్టం ముందు అందరూ సమానమే అనేది తెలియజేయాల్సిన అవసరం న్యాయస్థానాలకు ఉన్నది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు ఒక ప్రకటనలో కోరారు. మంగళవారం వినుకొండ సురేష్ మహల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పీడియం రాష్ట్ర నాయకులు వైవీ, పిడిఎమ్ జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ, పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చికినo చిన్న, కె. ప్రసాద్ పిడిఎమ్ తదితరులు పాల్గొన్నారు. (Story:మావోయిస్టు మృతదేహాలను కుటుంబ సభ్యులకి ఇవ్వకుండా దహనం చేయటం చట్ట వ్యతిరేకం)

