Homeవార్తలుతెలంగాణఅందరం కలిసి పోరాడితేనే దేనినైనా సాధించవచ్చు

అందరం కలిసి పోరాడితేనే దేనినైనా సాధించవచ్చు

అందరం కలిసి పోరాడితేనే దేనినైనా సాధించవచ్చు

డబుల్ బెడ్రూం కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు సర్దార్ ఖాన్

న్యూస్‌తెలుగు/వనపర్తి: అందరం కలిసి మెలిసి ఉండి పోరాడితేనే దేనినైనా సాధించవచ్చని డబుల్ బెడ్రూం కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు సర్దార్ ఖాన్ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్డులో ఉన్న ఆదర్శనగర్ డబుల్ బెడ్రూం కాలనీ అసోసియేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఎన్నో సమస్యలు ఉండేవని, ఐకమత్యంతో పోరాడి ఒక్కొక్కటి సాధించుకుంటూ వస్తున్నామన్నారు. కాలనీలో వీధిలైట్లు, సీసీ రోడ్లు సాధించుకున్నామని, మంచినీటి సమస్యను కొంతమేరకు పరిష్కరించుకున్నామని ఆయన చెప్పారు. ఇంకా మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించుకొని రాష్ట్రంలోనే ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుకుందామని చెప్పారు. కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం, సమావేశాలు నిర్వహించుకునేందుకు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. భవిష్యత్తులో కూడా కాలనీవాసులు అసోసియేషన్ కు మద్దతు తెలిపి సమస్యల పరిష్కారం కోసం సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మండ్ల రాజు, గోపాలకృష్ణ, గద్వాల సాయిలీల, జర్నలిస్ట్ నిరంజన్, ఎండి. జమీర్, విష్ణు సాగర్, ఎండి. అన్వర్, తిరుపతయ్య, సుధాకర్ రెడ్డి, మోహన్, బి.వెంకటేష్, జమ్ములమ్మ, లక్ష్మీ దేవమ్మ, సురేంద్ర బాబు, వినోద్, కాలనీవాసులు శత్రు నాయక్, రవికుమార్ చారి, మోషిన్ తదితరులు పాల్గొన్నారు. (Story:అందరం కలిసి పోరాడితేనే దేనినైనా సాధించవచ్చు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!