టిడిపి బూత్ కమిటీల ఎన్నిక
న్యూస్ తెలుగు/వినుకొండ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏ.పి ప్రభుత్వ చీప్ విప్, స్థానిక శాసనసభ్యులు జివి ఆంజనేయులు ఆదేశాల మేరకు యూనిట్ ఇన్చార్జి రియల్ ఎస్టేట్ జానీ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణం లోని 15 మరియు 20 వార్డుల తెలుగుదేశం పార్టీ కమిటీలు వేయడం జరిగింది. 15 వార్డు ప్రెసిడెంట్ గా షేక్ కారుమంచి మీరావలి బూత్ కన్వీనర్ గా పారెళ్ల విజయ్ లను ఎన్నుకోగా 20 వార్డు ప్రెసిడెంట్ గా ముప్పూరి రాములు, బూత్ కన్వీనర్ గా బొంకూరి కోటేశ్వరరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి పత్తి పూర్ణ చంద్రరావు, 20వ వార్డు కౌన్సిలర్ నంది నరసింహారావు, కాలంగి శ్రీనివాసరావు, పారెళ్ల సుబ్రహ్మణ్యం, బొంకూరి రోశయ్య, బత్తుల వెంకట్రావు, బాండ్ టైలర్, మహిళా నాయకురాలు ముప్పూరి చౌడమ్మ, లక్ష్మీ సామ్రాజ్యం, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.(Story : టిడిపి బూత్ కమిటీల ఎన్నిక )

