Homeవార్తలుతెలంగాణమంత్రి పొన్నం ఇలాఖాలో తీరని భూ 'వివాదాలు'

మంత్రి పొన్నం ఇలాఖాలో తీరని భూ ‘వివాదాలు’

మంత్రి పొన్నం ఇలాఖాలో తీరని

భూ ‘వివాదాలు’

   

న్యూస్ తెలుగు/సిద్దిపేట జిల్లా ప్రతినిధి: పెరుగుతున్న భూముల ధరలతో మంత్రి పొన్నం ఇలాకాలో వివాదాలు పెట్రేగి పోతున్నాయి. ప్రశాంతంగా వున్న పల్లెల్లో భూ సమస్యలు హత్యలకు దారి తీస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సర్కిల్ పరిధి పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల్లోనూ భూ వివాదాల శాతం ఎక్కువగా ఉంటోంది. కొన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకుంటుండంగా కొన్ని అపరిషృతంగా ఉన్నాయి. కాగా అక్కన్నపేట మండలంలోని ఆయా గ్రామాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఈ తరహా సమస్యలు పరిష్కారమవ్వకపోగా ఇరువురి మధ్య ఘర్షణలు చోటు చేసుకొని హత్యలకు కారణమవుతున్నాయి. ఈ భూ వివాదాల నేపథ్యంలో వంటలకు నష్టం చేయడమే గాక, విద్యుత్ మోటార్లను ధ్వంసం చేయడం, పైపులను కోయడం వంటి కారణాలతో కేసులు నమోదై చివరకు హత్యల వరకు కారణమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళితే అక్కన్నపేట మండల పరిధిలోని గండిపల్లి రెవెన్యూ పరిధిలోని అంబనాయక్ తండాకు చెందిన భూక్య చంద్రూ తండాకు ఆనుకొని వున్న సర్వే నెంబర్ 630లో తండ్రి పేరిట భూమిని కలుపుకొని 4 ఎకరాల భూమిని కల్గివున్నాడు. కాగా ఈ భూమి మీదుగా ట్రైకార్ నిధులతో తండాకు బీటీ రోడ్డు మంజూరవ్వడంతో రైతు భూక్య చంద్రూ రోడ్డు నిర్మాణాన్నీ అడ్డుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ హుస్నాబాద్ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు కోర్టు స్పందించి ప్రస్తుతం పనులు నిలిపి వేసి తదుపరి ఉత్తర్వుల తదనంతరం పనులు చేయాలని అలాగే బాధితుడికి అండగా నిలవాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అధికారులు పట్టించుకోవడం లేదని భాదిత రైతు చంద్రూ తన గోడు వెల్లబోసుకున్నాడు. తండా వాసులంతా ఏకమై తనను భయబ్రాంతులకు గురిచేస్తూ చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే తన వ్యవసాయ బావి వద్ద బిగించివున్న సీసీ కెమరాలను, బోరు స్టార్టర్ బాక్సులను ధ్వంసం చేసి భయాందోళన చెందామని దీని విషయంలో వలువురిపై స్టేషన్లో పోలీసులు కేసులు నమోదు చేసి హెచ్చరించారని,ఐన నేటికి తమకు తమ కుటుంబానికి తండాలో రక్షణ కరువై జీవణం సాగించలేక కాలం వెల్లదీస్తున్నమని దీనిపై స్థానిక అధికార యంత్రాంగం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Land disputes in Minister Ponnam’s area are intensifying due to rising land prices. Peaceful villages are witnessing land issues leading to murders. In Siddipet district’s Husnabad circle, land disputes account for a significant percentage of registered cases. Some issues remain unresolved, while others are settled.

Specifically, in Akkannapet mandal, disputes between villagers and tribal areas are not only going unresolved but also leading to clashes and murders. These land disputes are causing damage to crops, destruction of electric motors, and pipe cutting, resulting in registered cases and ultimately, murders.

A specific case involves Bhukya Chandru, a farmer from Ambanagyak Thanda in Gandhipalli revenue area. Chandru owns 4 acres of land, including land in his father’s name in survey number 630. However, with the construction of a BT road through his land funded by TRICOR, Chandru has approached the Husnabad court, seeking justice. The court has directed the authorities to halt construction work until further orders and provide support to the victim.

Despite court orders, authorities seem to be ignoring the issue, according to Chandru. Villagers are threatening him, damaging his property, and filing cases against him. Chandru is seeking help from local authorities to provide him and his family with protection and justice.

Source By@Special Correspondent: Naradas Eshwar (Story : మంత్రి పొన్నం ఇలాఖాలో తీరని భూ ‘వివాదాలు’)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!