ప్రభుత్వం ఇల్లు స్థలం ఇచ్చేవరకు పోరాటం ఆగదు
నేడే సిపిఐ ఆధ్వర్యంలో పేదల గోడు
సిపిఐ రాష్ట్ర నేతలు కే.రామకృష్ణ.అక్కినేని వనజ రాక
న్యూస్ తెలుగు/చింతూరు : అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా వ్యాపితంగా 12 వేల పైగా దరఖాస్తులు వ్రాచామని రాజమండ్రి పట్టణంలో 5 వేలు పైగా దరఖాస్తులు వచ్చాయని విరందరకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేవరకు పోరాటం ఆగదని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపు నిచ్చారు. బుధవారం ఉదయం అన్నపూర్ణ పేట, శ్యామల కాలనీ, గణేష్ నగర్, ఆర్యాపురం ప్రాంతాల్లో సీపీఐ నేతలు 17 కార్యక్రమం పై ప్రచారం నిర్వహించారు కబ్జా గు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ స్వంత ఇల్లు లేని ప్రతి పేదవాడు 17 న గురువారం ఉదయం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ లు రాజమండ్రి వస్తున్నారని వారు నాయకత్వం లో భూ పోరాటం చేస్తామని మధు తెలిపారు. కూటమి ప్రభుత్వం మూడు సెంట్లు భూమి కేటాయించి మాట నిలబెట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు కొన్ని మున్సిపాలిటీ స్థలాలపై కబ్జా దారుల కన్ను పడిందని ప్రభుత్వం వెంటనే ఈ భూములను ప్రజలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, ఏపి మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య,ఏ ఐ వై ఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు కె శ్రీనువాస్ , పి త్రిమూర్తులు జట్ల సంఘము బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రభుత్వం ఇల్లు స్థలం ఇచ్చేవరకు పోరాటం ఆగదు )