గ్రామ దేవతలు మన సాంప్రదాయ సంస్కృతికి చిహ్నాలు
చెన్నారం గ్రామ చౌడేశ్వరి దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎంపి రావుల
న్యూస్‌తెలుగు/వనపర్తి : రేవల్లి మండలం చెన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన చౌడేశ్వరి దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమములో మాజీ ఎంపి రావుల చంద్రశేఖరరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ గ్రామదేవతలు మన సాంప్రదాయ సంస్కృతికి చిహ్నాలు నిలుస్తాయని ఈ పండగలు ప్రజలలో భక్తిప్రభత్తులు,ఐకమత్యం పెంచుతాయని అన్నారు.
బాలికలను మంచిగా చదివించాలని బాలికలు పట్టుదలతో చదివి కుటుంబ వ్యవస్థకు అండగా ఉంటారని దీనికి నిదర్శనం 9మాసాలు అంతరిక్షములో ఉన్న సునీత విలియమ్స్ అని కొనియాడారు బాల్యవివాహాలు చేయవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి కూడా పాల్గొనాల్సి ఉండే అని వారు మరోసారి దేవాలయాన్ని సందర్శిస్తారని అన్నారు. గ్రామస్థులు రావులను ఊరేగింపుగా ఆహ్వానించి ఆలయ మర్యాదలతో సన్మానించారు. రావుల ఆలయ కమిటీ సభ్యులను ఒగ్గుకథ చెప్పే గాయకులను ఘనంగా సన్మానించారు. రావుల వెంట జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,రాజు రెడ్డి,రమేష్, ఆశన్న,బాలు చిన్నయ్య,శ్రీశైలం,సంజీవ,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : గ్రామ దేవతలు మన సాంప్రదాయ సంస్కృతికి చిహ్నాలు)