ఇందిరమ్మ నమూనా గృహాన్ని పరిశీలించిన కలెక్టర్ , ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణాన్ని శనివారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలు అతి తక్కువ ఖర్చులో అత్యాధునిక హంగులతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని చేసుకోవచ్చునని వారు సూచించారు. వనపర్తిలో గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ (నమూనా గృహాన్ని) సందర్శించి ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు అని ఎమ్మెల్యే సూచించారు. వారితోపాటు డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు (Story : ఇందిరమ్మ నమూనా గృహాన్ని పరిశీలించిన కలెక్టర్ , ఎమ్మెల్యే )