ఎటపాక మండలం లోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి
ట్రైబల్ మినిస్టర్ ని కలిసిన ఎటపాక మండల ఎస్టీసెల్ అధ్యక్షులు కణితి మధు
న్యూస్‌తెలుగు/చింతూరు : ఎటపాక మండలంలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని ఎటపాక మండలం ఎస్టీ సెల్ అధ్యక్షులు కానీతి మధు కోరారు.
రంపచోడవరం లో బుధవారం శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కలిసి ఎటపాక మండలంలోని 21 ఒక్క పంచాయతీలో గత ఐదు సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేదని, మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉందని కనుక 21 పంచాయతీలలో సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని అలాగే ప్రభుత్వ పాఠశాలలో భవనాలు వంట షెడ్లు నీటి కొరతతో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వారికి.సరైన వసతులు ఏర్పాటు చేయాలని అలాగే.మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు సోలార్ పంట బోర్లు ఏర్పాటు చేసి రైతులు ఆదుకోవాలని, పలు సమస్యల మీద మెమో రాండం ఇవ్వడం జరిగింది మంత్రి సానుకూలంగా స్పందించి తెలియజేసిన ప్రతి సమస్యని పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రిని కలిసిన వారు మువ్వ శ్రీను అరకు పార్లమెంటరీ కార్యదర్శి ఎటపాక మండల అధ్యక్షులు పుట్టి రమేష్ బాబు. నలజాల మధు ఎటపాక మండలం తెలుగు యువత అధ్యక్షులు ముత్యం సురేష్. బీసీ సెల్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. (Story : ఎటపాక మండలం లోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి)