నదుల అనుసంధానంతో నాలుగు జిల్లాలు సస్యశ్యామలం
న్యూస్ తెలుగు /వినుకొండ : పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతాంగానికి ప్రజలకు జీవనాడిగా వెలుగొందనున్న హరిశ్చంద్ర పురం నకరికల్లు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వెంటనే పూర్తి చెయ్యటం ద్వారా పది లక్షల ఎకరాల భూమికి సాగునీరు ఐదు జిల్లాల ప్రజానీకానికి త్రాగునీరు అందుతుందని,దశాబ్దాల కలగా మిగిలిపోయిన వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పనులు ప్రారంభించడం ద్వారా పల్నాడు ప్రకాశం జిల్లాలలో ఐదు మండలాల ప్రజలకు సాగు త్రాగునీరు అంది ప్రజలకు సుఖ జీవనానికి నాంది పలకవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, భారత కమ్యూనిస్టు పార్టీ పల్నాడు జిల్లా సమితి కార్యదర్శి మారుతి వరప్రసాద్ వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ని సోమవారం నాడు ఆయన స్వగృహంలో, పల్నాడు జిల్లా కలెక్టరేట్ లోని డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా వారికి ఈ ప్రాంత ప్రజల రైతాంగ సమస్యలను ప్రభుత్వం అధికారులు వివరించి తెలియజేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 సంవత్సరంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నదులను అనుసంధానం చేయాలి అనే లక్ష్యంతో మొదలైన హరిచంద్రపురం నగరికల్లు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగిందని 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకానికి పేరు మార్చి వైయస్సార్ పల్నాడు జిల్లా పరువు నివారణ వికేంద్రీకరణ పథకంగా మార్చడం జరిగిందని పేరు మార్పు తప్ప ఈ పథకానికి ఎటువంటి ప్రయోజనం జరగలేదని ఒక రూపాయి కూడా ఈ పథకానికి కేటాయించ లేదని వారు విమర్శించారు. మరల 2024 పౌర్ణమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతుల ఆశలు జి గురించే విధంగా ఓటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి 7వేల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలోని పలనాడు జిల్లా నందు వైకుంటపురం గ్రామం అమరావతి మండలం నుండి అయిదు లిఫ్టులతో ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 73 టీఎంసీల నీటిని మూడు మాసాల పాటు పల్నాడు జిల్లాలోని నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామం వద్ద నాగార్జునసాగర్ కాలువ నందు 50వ కిలోమీటర్ వద్ద కలువుట దీని ద్వారా నాగార్జునసాగర్ కెనాల్ కింద ఉన్న 9,61,230 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడం దీనికి జీవో ఎంఎస్ 98 ప్రకారం 6, 020 కోట్లకు పరిపాలన అనుమతి లభించింది పంప్ హౌస్ ల నిర్మాణం కొరకు పలనాడు జిల్లాలో అమరావతి పెదకూరపాడు కోసూరు రాజుపాలెం సత్తెనపల్లి నకరికల్లు మండలాల్లోని 23 గ్రామాల్లో కాలువ తవ్వకం పంపు హౌస్ స్టేషన్ లు తదితర అవసరాల కొరకు ప్రాజెక్టు నిర్మాణమునకు వేల ఎకరాల భూమి అవసరమై ఉన్నది అని అప్పుడే ఉన్నతాధికారులు సూచనలు ఇచ్చారని ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల రైతుల పాలిటీ సంజీవి ప్రాజెక్టు అయిన హరిచంద్రపురం నగరికల్లు ఎత్తి పోతల పథకానికి మెయిన్ పంప్ హౌస్ లు వెంటనే నిర్మించి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయుట ద్వారా అహర్నిశలు కష్టపడి దేశానికి ఆహార ధాన్యాలు పండించి ఇచ్చే రైతన్నకు మద్దతుగా నిలిచి సాగు త్రాగునీరు అందివ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా పనులు వెంటనే ప్రారంభించవలసిందిగా వినతిపత్రాలు ఇవ్వడం ద్వారా వారు తెలిపారు. అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని మంగళవారం నాడు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు పరిధిలోని రైతు పరిరక్షణ కమిటీ ద్వారా తమరికి విన్నవిస్తుందని కూడా వారు తెలిపారు.ఈ సందర్భంగా వినతి పత్రాలు ఇచ్చిన వారిలో పలనాడు జిల్లా నరసరావుపేట కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు, రైతు నాయకులు ఉప్పలపాటి రంగయ్య తదితరులు ఉన్నారు. (Story : నదుల అనుసంధానంతో నాలుగు జిల్లాలు సస్యశ్యామలం)