‘ఓ భామ అయ్యో రామా’ చిత్ర గ్లిమ్స్ విడుదల
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా ;సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రామ్ గోదాల దర్శకత్వంలో సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మనోజ్ తనకు జంటగా నటిస్తున్నారు.
ఇక ఈ చిత్ర గ్లింప్స్ వీడియో విషయానికి వస్తే ఈ చిత్రంలోని హీరో హీరోయిన్ ఒక కారులో ఒకరిని ఒకరు టీస్ చేసుకుంటూ సరదాగా ఉన్న సమయంలో కార్ బ్రేకులు పనిచేయక ఆ పరిస్థితి మారిపోయి మరో దిశగా పరిస్థితులు వెళ్తుంటాయి.
వి ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల నిర్మాతగా గొప్ప నిర్మాణ విలువలతో రానున్న ఈ చిత్రానికి నువ్వు నేను చిత్ర నటి అయిన అనిత హస్సనందిని చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రంలో కామెడీ పండించడానికి ప్రభాస్ శ్రీను, ఆలీ నటిస్తుండగా ఇటీవల యానిమల్ సినిమాలో కనిపించను నటుడు బబ్లు పృథ్వీరాజ్ ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి రాదన్ సంగీతాన్ని అందిస్తుండగా మణికంఠం ఎస్ సినిమాటోగ్రఫీ చేస్తూ భవిన్ షా ఎడిటింగ్ చేయనున్నారు. అంతేకాక ఎందరో అనుభవజ్ఞులు ఈ చిత్రానికి సాంకేత బృందంగా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు : సుహాస్, మాళవిక మనోజ్, అనిత హసానందిని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని తదితరులు.
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం : రామ్ గోదల
బ్యానర్ : వి ఆర్ట్స్
నిర్మాత : హరీష్ నల్ల
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : ఆనంద్ గడగోని, ప్రదీప్ తల్లపురెడ్డి
సినిమాటోగ్రాఫర్ : ఎస్ మణికందన్
సంగీత దర్శకుడు : రథన్
ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి
ఎడిటర్ : భవిన్ ఎం షా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : అశ్వత్, ప్రతిభ
ప్రొడక్షన్ మేనేజర్ : సంతోష్ గౌడ్
వీఆర్వో : ఏలూరు శ్రీను, మడూరి మధు
మార్కెటింగ్ ఏజెన్సీ : హ్యాష్ ట్యాగ్ మీడియా (Story : ‘ఓ భామ అయ్యో రామా’ చిత్ర గ్లిమ్స్ విడుదల)