ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో సంచలనం
న్యూస్‌తెలుగు/ చింతూరు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని నారాయణపూర్ జిల్లా గిరిజన మాజీ మావోయిస్టును చర్చల కోసం దట్టమైన అడవులలోకి పంపించిన భద్రతా బలగాలు. అబూజ్మడ్ అడవులలోకి మావోయిస్టులతో చర్చలకోసం లొంగిపోయిన ఒక గిరిజన మాజీ మావోయిస్టు ను అబూజ్మడ్ అడవులలోకి పంపిన భద్రతా బలగాలు.రోజులు గడుస్తున్నా అతని ఆచూకి ఇప్పటివరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన. వెళ్లేముందు కేంద్ర హోమం మంత్రి విజేయ్ శర్మ, బస్తర్ ఐ జీ సుందర్ రాజ్ పి తో మాట్లాడి మావోయిస్టు ల దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది.అతను మాత్రం వెళ్లే ముందు హింసా కాండ అవసరం లేదని శాంతి చర్చలు జరిపేందుకు మావోయిస్టుల దగ్గరికి ప్రభుత్వం తరఫున వెళుతున్నాని దాదాపు ఒకటిన్నర నిమిషాల సెల్ఫీ వీడియో తీసుకొని ఎం కే మురియా అనే ఐడి తో ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.ఐతే చర్చల కోసం వెళ్లిన గిరిజన మాజీ నక్సలైట్ మళ్ళీ మావోయిస్ట్ ల తో చేరిపోయాడ? లేక మావోయిస్టులు అతన్ని అదుపులోకి తీసుకున్నారా? అనే కోణంలో, అంతేకాకుండా ఈ సెల్ఫీ వీడియో ఏ నెట్వర్క్ పరిధిలో ఎప్పుడు చేశాడనే కోణంలో కూడా విచారణ చేపట్టిన పోలీసులు. (Story : ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో సంచలనం )