మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
న్యూస్ తెలుగు సాలూరు : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేశారని ఆయనకు ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఆయన అభిమానులు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ర అన్నారు. శనివారం ఆయన స్వగృహంలో వైయస్సార్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేసి పార్టీ పెట్టిన అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఆయన కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ప్రవేశపెట్టారని అందులో భాగంగానే సచివాలయ వ్యవస్థను గ్రామాల్లో ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు కృషి చేశారని అన్నారు. ప్రజలకు విద్య వైద్యము అందించడంలో ఆయనక సాటి మరి ఎవరు ఉండరని అన్నారు. ఆయన కాలంలో రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందాయి కాబట్టే ఆయన జనం హృదయాల్లో ఉన్నారని రానున్న రోజుల్లో మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు సువ్వడ భరత్ శ్రీను పాచిపెంట మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు గొట్టాపు ముత్యాల నాయుడు వైసిపి నాయకులు గిరి రఘు డోలు బాబ్జి దండి శ్రీను తట్టి కాయలు గౌరీ పాచిపెంట వీరమనాయుడు రెడ్డి సురేష్ సలాది అప్పలనాయుడు పిరిడి రామకృష్ణ గొర్రెలు గణపతి రావు వైయస్సార్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు )