డివైడర్ల మధ్యలో పిచ్చి మొక్కలు తొలగింపు చేస్తున్న మున్సిపల్ కమిషనర్
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణంలో ఎల్లవేళలా పరిశుభ్రత పాటించాలని రాష్ట్రంలోనే పారిశుధ్యంలో ఆదర్శవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు సూచన మేరకు వినుకొండ మున్సిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ డివైడర్లలో కలుపు మొక్కలను తీయడంపై దృష్టి సారించి రోడ్డు డివైడర్ క్లీనింగ్‌ను పరిశీలించారు. తనిఖీ సందర్భంగా, రోడ్డు మార్జిన్ల వెంబడి పరిశుభ్రత పాటించి డివైడర్లు శుభ్రంగా, కలుపు మొక్కలు లేకుండా డివైడర్ల మధ్యలో రోడ్ల పైకి వచ్చిన కొమ్మలను కత్తిరించి శుభ్రంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు దుమ్ము ధూళి నుంచి ఉపశమనం కల్పించాలని కమీషనర్ కార్మికులకు సూచించారు. (Story : డివైడర్ల మధ్యలో పిచ్చి మొక్కలు తొలగింపు చేస్తున్న మున్సిపల్ కమిషనర్)