ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం పాత సూగూర్ గ్రామ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులు తమ ఆవేదనను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పంచుకున్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అని అన్నారు. ధాన్యం తీసుకొచ్చి వారం అయిన కొనుగోలు చేయలేదని చూసి,చూసి దళారులకు అమ్మాల్సివస్తుందని అన్నారు.బోనస్, రుణ మాఫీ,రైతు భరోసా కు దిక్కులేదనీ తరుపున ప్రభుత్వంతో పోరాడాలని ప్రాడేయపడ్డారు. కెసిఆర్ నాయకత్వంలో ప్రశాంతంగా ఆన్న మేము ఆశపడి కాంగ్రెస్ పార్టీనీ గెలిపించి నట్టేట మునిగామని ఆవేదన వెలిబుచ్చారు. పాత సుగుర్ బ్రిడ్జి,సి.సి.రోడ్లు,గోదాములు మీరు నిర్మించి గ్రామ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. నిరంజన్ రెడ్డి నీ రైతులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో పరుశురాం,మధు,దశరథ్,రాముడు,పులి,తదితరులు పాల్గొన్నారు.(Story : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి)