బి.ఎస్.పి ఆధ్వర్యంలో ఘనంగా బిఆర్ అంబేద్కర్
68 వర్ధంతి
న్యూస్ తెలుగు /వినుకొండ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్బంగా వినుకొండ బహుజన సమాజ్ పార్టీ కార్యాలయం లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి నేరెళ్ళే రాజు మాట్లాడుతూ. దేశంలో ని ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలనీ, దేశం లో కొన్ని శక్తులు అంచెలంచెలుగా అంబేద్కర్ గ రాసిన రాజ్యాంగాన్ని తీసి వేయాలని కుట్రలు చేస్తున్నాయి. దీనిని ఎస్సీ , ఎస్టి , బిసి మైనారిటిలు అంబేద్కర్ వాదులు అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలిసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాసిపోగు ఎసోబు, వేల్పుల రాంబాబు, మందా సురేష్ బాబు, వల్లెపు రమేష్ బాబు, ఏనుబరి వరప్రసాద్,పూనూరి జాన్సన్, అమృతపూడి సురేష్, దుపాటి విజయ్, భవనాసి కోటి, వట్టికోటి శివప్రసాద్, ఒంగోలు నాగేశ్వరారావు, పరిశపోగు మాణికుమార్,నాలుకపల్లి రవిబాబు, పాలేటి కోటి, అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. (Story : బి.ఎస్.పి ఆధ్వర్యంలో ఘనంగా బిఆర్ అంబేద్కర్ 68 వర్ధంతి)