గీతాంజలి లీడ్ స్కూల్ నందు అంబరాన్ని తాకిన బాలల దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక కొత్తపేటలోని గీతాంజలి లీడ్ స్కూల్ నందు గురువారం బాలల దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ తేళ్ల కృష్ణవేణి ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. జవహార్ లాల్ నెహ్రూ చిన్నారులను అమితంగా ఇష్టపడే వారిని వారితో ఎక్కువ సమయం గడుపుతూ ఎంతగానో ఆనందించే వారిని, అలాగుననే చిన్నారులు కూడా ఆయనను ఎంతగానో ఇష్టపడే వారిని, కాబట్టి ఆయన జన్మదినం అయిన ఈ రోజును మనం బాలల దినోత్సవం గా జరుపుకోవడం ఆనవాయితీ అని, అది ఆ మహనీయునకు ఇచ్చే గౌరవం అని తెలిపారు. చిన్నారుల అందరూ మంచి విద్యాబుద్ధులతో మంచి నడవడికతో గొప్ప వ్యక్తులుగా ఎదగాలని, జీవితంలో రాణించాలని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనిపిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా అవి చూసిన ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆనందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ లక్ష్మణ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.(Story:గీతాంజలి లీడ్ స్కూల్ నందు అంబరాన్ని తాకిన బాలల దినోత్సవ వేడుకలు )