బిగ్గెస్ట్ ఈవెంట్ ఫర్ బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ ది రూల్
నవంబరు 17న పాట్నాలో పుష్ప-2 ది రూల్ మాసివ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా : పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్… నీయవ్వ తగ్గేదేలే.. పుష్ప ది రైజ్‌లో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ చెప్పిన ఈ మాసివ్ డైలాగులు ఇంకా అందరి చెవులో మారుమ్రోగుతూనే వున్నాయి. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప ది రైజ్’ తో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ క్రియేట్ చేసిన సన్సేషన్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మరోసారి మాసివ్‌గా మాట్లాడుకోవడం ఈ సినిమా విషయలో అందరూ చూశారు. ఇక త్వరలోనే ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలిం పుష్ప-2 ది రూల్ ద్వారా అల్లు అర్జున్-సుకుమార్‌ల ద్వయం మరో బిగ్గెస్ట్ సన్సేషన్ సృష్టించబోతున్నారు. డిసెంబరు 5 నుంచి బాక్సాఫీస్ కలెక్షన్ల సునామీ రాబోతుంది. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలిం ప్రమోషన్ కార్యక్రమాలు ఇక ఎగ్రెసివ్‌గా స్టార్ అయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్స్‌ను పాట్నా, కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబయ్ హైదరాబాద్‌లో ఈ మాసివ్‌గా నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే పుష్ప-2 ది రూల్ చిత్రం ట్రయిలర్ లాంచ్‌ను ఈ నెల 17న బిగ్గెస్ట్ ఈవెంట్ ఫర్ ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలింగా పాట్నాలో అత్యంత గ్రాండ్‌గా ఈ మాసివ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ మాసివ్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో గన్‌ను భుజన వేసుకుని మాసివ్, ఫైర్ లుక్‌తో.. తనదైన స్వాగ్‌తో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నడిచొస్తున్న స్టిల్ చూస్తుంటే.. అల్లు అర్జున్ అభిమానులు గూజ్‌బంప్స్ ఖాయం.. ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది. ఇక బాక్సీఫీస్ రికార్డులను రూపుమాపడానికి, ఇండియాన్ బాక్సాఫీస్‌ను కలెక్షన్ల సునామీతో ముంచెత్తడానికి అల్లు అర్జున్- బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల వండర్‌ఫుల్ ఫిల్మ్ పుష్ప-2 ది రూల్ అస్సలు తగ్గేదేలే అనే రేంజ్‌లో ఫుల్ ఫైర్‌తో వస్తోంది… ! అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.