Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆధ్యాత్మిక తోనే మనశ్శాంతి లభిస్తుంది

ఆధ్యాత్మిక తోనే మనశ్శాంతి లభిస్తుంది

ఆధ్యాత్మిక తోనే మనశ్శాంతి లభిస్తుంది

పిరమిడ్ నిర్వాహకులు

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆధ్యాత్మిక తోనే మనశ్శాంతి లభిస్తుందని పిరమిడ్ ఆధ్యాత్మిక జ్ఞాన మందిరం సొసైటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా గురువు సుభాష్ పత్రీజీ జన్మదినం సందర్భంగా వారు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణములోని ఆరు పిరమిడ్ కేంద్రాలలో గల వెయ్యి మంది ధ్యానులు పట్టణంలోని పలు కూడలిలో శాఖాహార ర్యాలీని నిర్వహించారు. అనంతరం సొసైటీ వారు మాట్లాడుతూ సుభాష్ పత్రీజీ వేణి 1947లో జన్మించారని, 30 సంవత్సరాలు ధ్యాన ప్రచారం చేసి లక్షల మందికి ధ్యాన రూపంలో ముక్తిని కలిగించారని తెలిపారు. భారతదేశంలో పాటు దాదాపు 40 దేశాలలో గ్రామ, గ్రామాన వీరి పిరమిడ్ కేంద్రాలు కలవని తెలిపారు. గురువు సుభాష్ పత్రీజీ యొక్క సందేశాలు ఎంతో భక్తి భావనతో కూడుకున్నవని, వయసుతో నిమిత్తం లేకుండా నేడు పిరమిడ్ కేంద్రాలలో తమ భక్తిని చాటుకుంటున్నారని తెలిపారు. అనంతరం 1500 మందికి భోజన పంపిణీ నిర్వహించారు. ఈ వేడుకల్లో వెయ్యి మంది ధ్యానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. (Story : ఆధ్యాత్మిక తోనే మనశ్శాంతి లభిస్తుంది)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!