మహిళ గొలుసు అపహరణ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని శారద నగర్ లో గుర్తుతెలియని దొంగలు శాంతినగర్ కు చెందిన రాములమ్మ తన బిడ్డ ఇంటికి వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకొని వచ్చి తన మెడలో ఉన్న 3.50 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారని బాధితురాలు వాపోయింది. ఈ సందర్భంగా టూటౌన్ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్, టూ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, రెడ్డప్పలు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి బాధితురాలితో వివరాలను తెలుసుకొని చుట్టుపక్కల ప్రాంతాలలో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలను చేపట్టారు. కొన్ని నెలలుగా ధర్మవరంలో చైనీస్ మ్యాచింగ్ ఆగిపోగా, తిరిగి మొదలు కావడంతో పట్టణ మహిళలు భయంధారులకు గురవుతున్నారు. పోలీసులు ఇటువంటి వారిపై చర్యలు గైకొనాలని, మహిళలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. (Story : మహిళ గొలుసు అపహరణ)