UA-35385725-1 UA-35385725-1

మున్సిపల్ కమీషనర్ ఐ.ఎస్.డబ్ల్యు.ఎం. ప్లాంట్‌ తనిఖీ 

మున్సిపల్ కమీషనర్ ఐ.ఎస్.డబ్ల్యు.ఎం. ప్లాంట్‌ తనిఖీ 

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణంలోని కారంపూడి మార్గంలో ఉన్న చెక్‌వాగు ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఎస్‌డబ్ల్యుఎం) ప్లాంట్‌ను గౌరవ ఎమ్మెల్యే జి.వి ఆంజనేయులు సూచన మేరకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ శనివారం పరిశీలించారు. ఐ.ఎస్.డబ్ల్యు.ఎం లో విండ్రోస్ విధానం ద్వారా తయారు చేసిన ఎరువులను కమిషనర్ పరిశీలించారు. విండ్రోస్ విధానము నుండి ఎరువు తయారీ సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి పలు సూచనలు చేశారు. విండ్రోస్ విధానంలో ఏరోబిక్ కంపోస్టింగ్ ఉంటుంది. ఇక్కడ సేంద్రీయ వ్యర్థాలు పోషకాలు అధికంగా ఉండే ఎరువులుగా కుళ్ళిపోతాయి. ఈ పర్యావరణ అనుకూల పద్ధతి వ్యర్థాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. హానికరమైన వ్యాధికారకాలను తొలగిస్తుంది మరియు తడిచెత్త ద్వారా నాణ్యతగల కంపోస్ట్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. కమిషనర్ ఐ.ఎస్.డబ్ల్యు.ఎం సిబ్బందికి పలు సూచనలు చేశారు. విండ్రోస్ ప్లాట్ఫార్మ్ సంకెను పెంచాలని
తడి చెత్తను కంపోస్ట్ చేయడానికి అనువైన పరిస్థితులను నిర్వహించడానికి ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, నీటి ఎద్దడిని నివారించడానికి సమర్థవంతమైన తేమ నిర్వహణను అమలు చేయాలని, కుళ్ళిపోయే ప్రక్రియను వేగవంతం చేయడానికి గాలి ప్రసరణను సరిచూసుకోవాలని, లీచెట్ సేకరించు పిట్ పై మూతను ఏర్పాటు చేయాలని సూచించారు. (Story : మున్సిపల్ కమీషనర్ ఐ.ఎస్.డబ్ల్యు.ఎం. ప్లాంట్‌ తనిఖీ )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1