హెచ్ఎం కుల్లాయప్పను సస్పెండ్ చేయాలి
విద్యార్థి సంఘం నాయకులు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఇందిరమ్మ కాలనీలో గల మున్సిపల్ హై స్కూల్ హెడ్మాస్టర్ ను వెనువెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్బి, బి ఎస్ యు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఎంఈఓ గోపాల్ నాయక్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి పోతులయ్య మాట్లాడుతూ
పాఠశాల సమయంలోనే మద్యం మత్తులో ఉన్న ఒక ఆకుతాయి ఇద్దరు చిన్నారులను బయటికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సమయంలో స్థానికలు గమనించి దేహశుద్ధి చేయడం జరిగింది అని తెలిపారు.
విద్యార్థులకు రక్షణ కరువై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని, ఇదే సమస్య గతంలో కూడా విన్నవించుకున్న కానీ పట్టించుకోలేదు అని మండిపడ్డారు. గతంలో విద్యా సంస్థ ప్రాంగణంలోకి చొరబడి యువకులు అందరూ చెడు వ్యసనాలు చేస్తూ పాఠశాలలోనే విద్యార్థులకు భయాందోళన గురి చేసే విధంగా ప్రవర్తించేవారు అని తెలిపారు.ఆ విషయంపై ఉన్నటువంటి హెచ్ఎం లకు ఉపాధ్యాయులకు ఎన్నోసార్లు తెలియచేసిన కూడా ఉంటే ఉండు లేదంటే స్కూల్లో నుంచి వెళ్లిపోండి అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు ఇలా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి హెచ్ఎంలు ఉండడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల బాగోగులు చూడాల్సిన ఇటువంటివి హెచ్ఎంలు వెంటనే సస్పెండ్ చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. (Story : హెచ్ఎం కుల్లాయప్పను సస్పెండ్ చేయాలి)