UA-35385725-1 UA-35385725-1

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : పెద్దమందడి మండలం మోజర్ల, పెద్దమందడి , పామిరెడ్డి పల్లె గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వాళ్లు ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ సిఎం .రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని 18/0 7/2024 నా రెండు లక్షల రుణమాఫీ పైకి శ్రీకారం తెలంగాణ చరిత్రలో18/07/2024వ తేదీ సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని అన్నారు. రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగింది. రెండు లక్షల పైబడిన రైతులకు కొన్ని సాంకేతిక లోపాల వల్ల రుణమాఫీ కాలేదు వాళ్లకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని అన్నారు
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతన్నలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని అన్నారు. రైతులకు వడ్లకు గిట్టుబాటు ధర ఏ గ్రేడ్ 2.320/-బి గ్రేడ్ కు 2.300/-రూపాయలు ఇస్తుందని సన్న వడ్లకు 500 /-రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
రైతన్నలకు కావాల్సిన గన్ని బ్యాగులను కొరత లేకుండా సప్లై చేయాలని పై అధికారులకు ఫోన్లో మాట్లాడి సూచించారు.
చిన్నారెడ్డి గారు రైతులతో మాట్లాడుతూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్యలు ఉన్న నా దగ్గరికి రండి సమస్యలను పరిష్కరిస్తామని రైతన్నలకు భరోసానిచ్చారు. రైతన్నలకు రెండో పంట వేయడానికి సంసిద్ధం కావాలని మీకు నీటి కొరత లేకుండా చూసుకునే బాధ్యత నాదే అని ధైర్యాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెలచిన్నారెడ్డి . సింగల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, పెద్దమందడి ఎంఏఓ సైదులు యాదవ్ , సింగల్ విండో మాజీ అధ్యక్షుడు ఐ సత్య రెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, పెద్దమందడి మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సి.పెంటన్న యాదవ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మొగిలి సత్యారెడ్డి, పెద్దమందడి మాజీ వైస్ ఎంపీపీ సాక వెంకటయ్య,జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గట్టు మన్యం, పెద్దమందడి ఎస్సీ సెల్ అధ్యక్షుడు గట్టు దయాకర్, సింగల్ విండో నెంబర్లు గట్టు సుందరమ్మ, వాకిటి నరేష్, రామ్ సింగ్ నాయక్, పెద్దమందడి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, పెద్దమందడి బీసీ సెల్ అధ్యక్షుడు రఘు, మోజర్ల మాజీ సర్పంచ్ ఎం. నాగరాజు, బాల్ చంద్రి, రాఘవేంద్ర రెడ్డి, రమేష్ గౌడ్, విట్ట రాజబాబు, పెద్ద సత్తిరెడ్డి, ఆయా గ్రామాల రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. (Story : వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1