ఘనంగా జరిగిన కార్తీక మాస పూజలు..
అర్చకులు కైప ద్వారకనాథ్ శర్మ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని బ్రాహ్మణ వీధి- చెరువు కట్ట వద్ద గల శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంలో అర్చకులు కైప ద్వారకనాథ శర్మ కార్తీకమాస పూజలను భక్తాదుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వారకనాథ్ శర్మ శివునికి వివిధ పూజలతో పాటు, వివిధ అభిషేకాలు, వివిధ పూలలతో చేసిన అలంకరణ భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా మహాన్యాస పూర్వక ఏకాదశి వారం సందర్భంగా రుద్రాభిషేకములు కూడా నిర్వహించారు. శివనామ సంకీర్తన ఆలయంలో జోరుగా కొనసాగింది. అనంతరం భక్తాదుల పేరిటన ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. (Story : ఘనంగా జరిగిన కార్తీక మాస పూజలు.. ) n