పేకాటస్థావరాలపై పోలీసుల దాడులు
రూ.14,150 నగదు స్వాధీనం-6 మంది అరెస్ట్.. టూ టౌన్ సీఐ రెడ్డప్ప
న్యూస్‌తెలుగు/ధర్మవరం : పట్టణంలోని 2టౌన్ పరిధిలోని తారకరామాపురం శివారులో రాబడిన రహస్య సమాచారం మేరకు పేకాట ఆడుతున్న స్థావరాలపై ధర్మవరం టూ టౌన్ సిఐ రెడ్డప్ప తన సిబ్బందితో వెళ్లి దాడులను నిర్వహించారు. అక్కడ పేకాట ఆడుతున్న ఆరు మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.14,150 లను నగదును స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం పలువురు రౌడీలకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. (Story : పేకాట సవరాలపై పోలీసులు దాడులు)