కొమురం బీమ్ విగ్రహంను ఆవిష్కరించిన మంత్రి సీతక్క
న్యూస్ తెలుగు /ఏటూరునాగారం (ములుగు జిల్లా బ్యూరో ) :
కొమురం బీమ్ ఆదివాసీ ప్రజల హక్కుల కోసం ఆలుపెరగని పోరాటాలు చేశారని, అయన చేసిన, పోరాట ఫలితమే, నేడు,గిరిజనులు జీవిస్తున్నారన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అడివినే నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీల కోసం, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటిసరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ఏటూరునాగారం మండల కేంద్రంలో వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కొమురం బీమ్ విగ్రహ ఆవిష్కరణకు,మంత్రి సీతక్క ముఖ్య అతిధిగాగా హాజరై, కొమురం బీమ్ విగ్రహం ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీలో పోడు సమస్య ఉందని, అట్టి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్రలోని ఉన్న,ఐటిడిఎ లో నిధులు లేక, కొంత అభివృద్ధి జరగటంలేదని, కేంద్రంనుండి, ఐటిడిఏ కు రావాల్సిన నిధులు రావటంలేదని,కేంద్రం నుండి రావాల్సిన నిధులు,రాష్ట్ర, నుండి, నిధులు తెచ్చి, ఐటిడిఏ లను బలోపేతం చేసి, గిరిజన అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు, ఏటూరునాగారం, ఉట్నూర్ ఐటిడిఏలు భవనాలు శిదిల వ్యవస్థలో ఉన్నాయని, వాటి కొత్త భవనాల కోసం, ముఖ్య మంత్రి ద్రుష్టికి తీసుకపోయి, వాటిని పరిష్కారం చేస్తామన్నారు.పలు అంశాలపై మంత్రి మాట్లాడారు. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే లు, ఆదివాసీ హక్కల సంఘం నాయకులు, తదితర వక్తలు మాట్లాడారు. ముందుగా ఐటిడిఏ కార్యాలయంనుండి వై జంక్షన్ వరకు, డోలి, వాయిద్యలతో, నృత్యలతో గిరిజనులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్ర,ఆదివాసీ హక్కుల పోరాటం సమితి అధ్యక్షులు వట్టం ఉపేందర్, పోదేం కృష్ణ ప్రసాద్, నల్లబోయిన కోటి, జిల్లా అధ్యక్షులు జనార్దన్, మహిళాలాలు, యువత, మేధావులు, తదితరులు పాల్గొన్నారు. (Story : కొమురం బీమ్ విగ్రహంను ఆవిష్కరించిన మంత్రి సీతక్క)